ఇప్పుడు టాలీవుడ్ లో సీను రివర్స్ అయింది. నిన్నటి వరకు టాలీవుడ్ మీద తెగ జోకులేసేసిన రామ్ గోపాల్ వర్మ మీద, ఇప్పుడు టాలీవుడ్ లో ప్రతీ ఒక్కరూ జోకులేసేస్తున్నారు. ఒకరికొకరు ఫోన్లు చేసుకుని మరీ నవ్వుకుంటూ కామెంట్లు చేసుకుంటున్నారు. షూటింగుల్లో అయితే ఇక చెప్పేక్కర్లేదు, ఎక్కడ చూసినా ఈ టాపిక్కే. దీనికి కారణం...వర్మ లేటెస్ట్ గా తీసిన 'అప్పల్రాజు' కి ఫ్లాప్ టాక్ రావడమే.
టాలీవుడ్ మీద సెటైర్ గా రూపొందించిన ఈ సినిమా పట్ల తెలుగు సినిమా రంగంలోని వాళ్లంతా మొదటి నుంచీ అయిష్టంగానే వున్నారు. ఈ సినిమా ఫ్లాప్ అవ్వాలని కూడా కోరుకున్నారంతా. దాని కోసమే ఎదురుచూస్తూ, ఆ క్షణం రాగానే ఇక మోసేయడం మొదలెట్టారు. పాపం... ఇందులో యాక్ట్ చేసినందుకు సునీల్ కూడా వాళ్లకి దొరికిపోయాడు. మూలుగానే వర్మ అన్నా, వర్మ వ్యవహార శైలి అన్నా టాలీవుడ్ లో చాలా మందికి మింగుడు పడదు. ఇప్పుడీ సినిమా కూడా అందుకు తగ్గట్టుగా ఉండడంతో ఇక అంతా పండగ చేసుకుంటున్నారు. అయితే... షరా మామూలుగా వర్మ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటున్నాడు
No comments:
Post a Comment