తొలి చిత్రం "ఏ మాయ చేసావె"తోనే తెలుగులో యమక్రేజ్ కొట్టేసిన సొట్టబుగ్గల సమంత మాజీ మిస్ చెన్నై త్రిషను పొగడ్తలతో ఆకాశానికెత్తేస్తోంది. త్రిషకు తాను వీరాభిమానిననీ అంటోంది. తనకు ఆమే స్ఫూర్తి అనీ, ఆమె నటనా మెళకువల్ని ఎప్పటికప్పుడు గమనిస్తుంటానని అందమైన ఆ రెండు లేత పెదవులను సాగదీస్తూ నవ్వుతూ చెప్పింది.
సమంత అభిమానం గురించి త్రిష వద్ద ప్రస్తావిస్తే... తాను సమంత నటిస్తున్న చిత్రాలను చూస్తున్నాననీ, ఆమె నటనకు తాను ముగ్ధురాలినవడంతోపాటు సమంత అభిమానినయ్యాననీ అంటోంది.
వీళ్లద్దరూ ఒకరికొకరు ఇలా ఎత్తేసుకోవడం వెనుక కారణం ఏదైనా ఉన్నదా..? అని కోలీవుడ్ సినీజనం అనుమానం వ్యక్తం చేస్తున్నారట. మరా విషయం కనిపెడతారేమో చూడాలి.
1 comment:
mee title choosi nenu edo oohinchesukunnanu. cha alantidemee leda? upch :(
Post a Comment