Tuesday, September 13, 2011

22 గంటలు ఏకధాటిగా పాల్గొన్న సెక్సీలేడీ...



మామూలుగా మనం 8 గంటలు లేదా 10 గంటలు పని చేస్తాం. మహా అయితే 12 గంటలు. కానీ బాలీవుడ్ సెక్సీ హీరోయిన కరీనా కపూర్ ఏకంగా 22 గంటలు పాటు శ్రమించి అందరినీ ఆశ్యర్య పరిచింది. సైఫ్ అలీఖాన్ స్వీయనిర్మాణలో తెరకెక్కిస్తున్న ‘ఏజెంట్ వినోద్’లో ఈ జీరో సైజ్ సుందరి చేసిన సాహసం ఇప్పుడు బాలీవుడ్ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఐటమ్ సాంగ్స్ రాజ్యమేలుతున్న బాలీవుడ్‌లో సాంప్రదాయ రీతిలో సాగే ముజ్రా నృత్యాన్ని ఈ చిత్రంలో పెట్టారు దర్శకుడు. సరోజ్‌ఖాన్ నృత్యదర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాటను కరీనాపై ఏకధాటిగా 22 గంటల పాటు చిత్రీకరించారట. ఇందులో ఎక్కువ సమయం ఆమె మెకాళ్లపై నర్తించాల్సి వచ్చిందట. దీంతో పాట పూర్తయ్యే సరికి కరీనా మెకాళ్లు నేలకు ఒరుసుపోయి కందిపోయాయట.

ఈ విషయమై కరీనా స్పందిస్తూ..గ్యులర్ పాటల్లో ఎలాగైనా నర్తించవచ్చు. కానీ ఇలాంటి సంప్రదాయ నృత్యాల్ని అంకితభావంతో చేయాలి. శారీరకంగా కూడా శ్రమించాలి. నాకు శాస్త్రీయ నృత్యాల్లో ప్రవేశం లేకపోయినా దాదాపు 22 గంటల పాటు శ్రమకోర్చి ఈ పాటను పూర్తిచేయడం ఆనందంగా వుంది..ఇక గాయం సంగతంటారా...బెస్ట్ అవుట్‌పుట్ రావాలంటే ఇలాంటి వాటికి ఓర్చుకోవాలి’ అని వ్యాఖ్యానించింది. వృత్తిపరంగా అంకితభావంతో పనిచేసే హీరోయిన్ గా మొదటి నుంచి కరీనాకు ఓ మంచి పేరుంది. ఒక్కసారి ఏదైనా సినిమాకు కమిట్ అయితే చిత్రీకరణ పూర్తవడం మొదలుకొని ప్రచార కార్యక్షికమాల్లో విధిగా పాల్గొంటుంది. తాజా సాహసంతో దర్శక నిర్మాతల వద్ద మరిన్ని మంచి మార్కులు కొట్టేసింది కరీనా.

No comments: