గుండమ్మ కథ చిత్రాన్ని నందమూరి, అక్కినేని రెండో తరం హీరోలైన బాలకృష్ణ, నాగార్జునలతో తీయాలని చాలా మంది అనుకున్నారే కానీ దానిని తీయడానికి సాహసించలేకపోయారు. క్లాసిక్స్ ని రీమేక్ చేయడానికి భయపడతానని, అందుకే వాటి జోలికీ పోవడానికి తెగించనని నాగార్జున చెప్పాడు. అయితే తమ ముందు తరం వాళ్లు చేయలేకపోయింది తాము చేసి జూ ఎన్టీఆర్, నాగచైతన్య నిర్ణయించుకున్నారు, గుండమ్మ కథ చిత్రం చేయడానికి వీరిద్దరూ అమితాసక్తితో ఉన్నారు.
జూ ఎన్టీఆర్ అయితే ఇప్పటికే ఈ చిత్రం చేయడానికి అన్నీ సిద్దం చేయాల్సిందిగా కొందరికి పురమాయించాడు. కానీ నాగార్జున మాత్రం ఈ చిత్రం చేయడం అంత శ్రేయస్కరం కాదని అంటున్నాడు. ‘దేవదాసు’ రీమేక్ చేస్తే ఏమైందో చూశామనీ, క్లాసిక్స్ జోలికి పోతే చేతులు కాలతాయని జూ ఎన్టీఆర్ కి నాగ్ క్లాస్ పీకాడని సమాచారం.
కాగా మరొక్క విషయం కూడా చెప్పాడు నిర్మాతలు చాలా మంది మా దగ్గరి రీమేక్ విషయంలో వచ్చినా ఎందుకు నేను, బాలకృష్ణ గుండమ్మకత చేయలేదు..క్లాసిక్ సినిమాల జోలికెలితే ఎంజరుగుతుందో తెలుసు కాబట్టి చేయలేదన్నారు. కానీ ఎందుకు చేయలేమో చూస్తామని జూ ఎన్టీఆర్ చైతన్య ఇద్దరూ పట్టుబడుతున్నారట
No comments:
Post a Comment